Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం 199

6.36. భూతకాలం : -ఎ-, -ఇ-, -ఇతి-, -తి- ప్రాచీన భాషలో భూతకాల ప్రత్యయాలు. ఉదా. సాగించెను (SII 10.780.7,17 వ శ,), చేసిరి (NI 2 కందుకూరు 41.80,1683). వెలసితివి (SII 10.780.24,17 వ శ.), చేస్తిమి (SII 5.166.5,1624), చేస్తిమి వంటివి ఈ నాటికీ కొన్ని మాండలికాలలో, ముఖ్యంగా తెలంగాణాలో వ్యవహారంలో ఉన్నాయి.

-ఇనా/-ఇన-/-ఇన్‌- ఈ యుగంలో భూతకాల ప్రత్యయాలు : ఉదా. వచ్చినావు (SII 6.79.14, 1796), నడచినవో (NI 3 రాపూరు 3.11,1638), అయింది (SII 5.1175.11,1419). ప్రాతిపదిక చివరి -న్‌ పైన ఇనా/ఇన్‌ లోని ఇ లోపిస్తుంది. వుంన్నాము (చూ. వెంకటరావు 1900.549. విజయరంగ చొక్కానాధుని శాసనం. 1708:82. ఈ రూపం వర్తమాన కాలార్థంలో కూడా కనిపిస్తుంది. చారిత్రకంగా పై రూపొలు వేయించిన వాడను, వచ్చినవాడు మొదలైన క్రియాజన్య విశేషశాలనుంచి వకారం లోపంవల్ల ఏర్పడ్డాయి. ఆధునిక రూపాలైన వచ్చాడు, వచ్చిండు, వచ్చాము మొదలైనవి పై రూపాలనుంచి ఏర్పడ్డవే.

6.37. వర్తమాన కాలం : సమకాలీన భాషలో -తు- వర్తమాన కాల ప్రత్యయం. ఉదా. చేస్తున్నారు [SII 10.75 9.22,1668).-చున్‌- ప్రాచీన భాషకు సంబంధించిన వర్తమానకాల ప్రత్యయం.

6.38. భవిష్యత్కాలం : చేయగలవాడు మొదలైన క్రియాజన్య విశేషణాల నుంచి వకార లోపంవల్ల ఏర్పడ్డ చేయగలడు వంటి రూపాలు ప్రాచీన భాషలోలాగా భవిష్య దర్ధకాలుగా కాకుండా ఆధునిక భాషలో లాగా సామర్థ్యార్థద్యోతకాలుగా కనిపిస్తున్నాయి. -తా- ప్రత్యయంతో కూడిన తద్ధర్మ భవిష్యద్రూపాలు చేస్తారు (NI 3 కందుకూరు 48.82,1650) వంటివి భవిష్యదర్థంలో వాడుకలో ఉన్నాయి.

6.39. తద్ధర్మార్థకాలు : ప్రాచీన భాషలో -ø-, -దు-, -తు-, సమ కాలీన భాషలో -తా- తద్ధర్మార్థక ప్రత్యయాలు. ఈ క్రియలన్నీ శాసనాల్లో భవిమ్యత్తునే సూచిస్తున్నాయి. ఉదా. దెంగు -ø- ను (NI 2 నెల్లూరు 4.10, 1638), సేయు-దు-రు. (NI 3 పొదిలి 13 24,1642), చేస్తారు (NI 2 కందుకూరు 48.82,1650).