పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

29

దరు. వంట చేసుకొనుటకు దిగుటకు స్థలము లిచ్చెదరు. ఈ సత్రములో పూర్వము కొంత కాలము భోజనము పెట్టక సామానుల నిచ్చు చుండిరి.

దేవ స్థానపు సత్రమ.

పై సత్రమునకు ప్రక్కన సత్ర మొకటిగలదు. ఇది శిధిలమైనందున దేవస్థానంవారు కట్టుటకు యేర్పాటు చేయబోవుచున్నారు.

శృంగగిరి స్వాములవారి మఠము.

యీ వీధిలో తూర్పు శ్రేణిలో చిన్నయిల్లు గలదు. ఉత్తరపు వీధిలో పూర్వము పెద్దమఠము పెరడు ఉండినది. అది శిధిలమైన తర్వాత నిది యేర్పాటయినది. ఈ మఠమునకు దేవస్థానంనుండి నిత్యము హోరవెచ్చము (బియ్యము మామూలు) గలదు.

గోసాయి మంటపము.

వాయువ్యమూలలో గోసాయి (అనగా రైలు లేని కాలమున దేశమంతతిరిగి దేవస్థానమునకు ముడుపులను జనమును తీసుకొనివచ్చెడివారు) మంటపము చిన్న గుంటగలవు. శ్రీవారి బ్రహ్మోత్సవమునకు గోసాయి జండాతో వచ్చును. ఈజండా వూరుబయటకురాగా దేవస్థానమువారు మేళ తాళములు పంపించి వూరు బయటనుండి యీ గోసాయి మంటపలో ప్రవేశించు వరకూ దేవస్థానం వాయిద్యములతో పిల్చుకొని రాబడును.