పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

తిరుమల తిరుపతియాత్ర.

నుబట్టి వంటకము లుండును గానీ ఒక్క నిర్ధారణ రేట్లు లేవు. ఈమఠమును పెద్ద జియ్యంగార్ల మఠమున్ను దేవస్థానముకట్టడములు, వీర్లు కైంకర్యములు చేయుచు నుండుటకు ఏర్పాటు చేయఁబడినవి.

అధికారివారి తోట.

పశ్చమ వీధిలో పశ్చమ శ్రేణిలో మొదట వేంకటగిరి రాజాగారి తోట వగై రాలుండెను-ఆతోటలో శ్రీవారిని వేంచేపు చేసి వుత్సవము జరుగుచుండెను. ఆధర్మము నిలుపబడి ఆతోట వగైరాలు శ్రీ అధికారి రామలఖన్ దాసుజీ వారికి విక్రయింప బడినవి. వారు ఆతోటకు తమ మఠము తోటను కలిపి పెద్ద తోటగ జేసి ఒక మంటపమున్నూ సత్రమున్నూ కట్టించిరి. ఆ సత్రమున బసలిచ్చెదరు. శ్రీవారి బ్రహ్మోత్సవములో రాత్రి పూటయు శ్రీవారికి చైత్ర శుద్ధ త్రయోదశి మొదలు మూడుదినములు జరుగు వసంతోత్సవము రేయింబవళ్లు సత్రమున బ్రాహ్మణులకు ప్రతిపునర్వసు నక్షత్రమున శ్రీరాములవారు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతముగ దయచేసెదరు. వసంతోత్స ములో శ్రీవారు విచ్చేసెదరు.

మైసూరు గవర్నమెంటువారి సత్రము.

ఈ వీధిమధ్యను మైసూరు గవర్నమెంటువారి సత్రము వైశాల్యము గలిగియున్నది. ఇది చాలకాలమునుండి యున్నది. ఈ సత్రములో నేకాదశి రోజులు తప్ప తక్కిన దివసములు యాత్రికులయిన బ్రాహ్మణులకు మధ్యాహ్న మొకపూట శ్రీవారి దేవస్థానములో నివేదన అనంతరం భోజనము పెట్టె