పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటికూర్పునకు పీఠిక.


శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానములో శ్రీవిచారణా కర్తలవారిక్రింద పారుపత్యదార్ అను నుద్యోగమును వహించు చుండు నేను యాత్రికుల సౌకర్యార్థ మొక గ్రంథ మత్యావశ్యకమని స్వానుభవముచే నిశ్చయించి దీనిని రచియించినాఁడను. ఇందులో కొన్ని సంగతులు అవ్యవస్థచే వదలియుండును. అవి రెండవకూర్పులోఁ జేర్చబడును.

ఈ చిట్టి పొత్తములో శ్రీవేంకటేశ్వరస్వామివారి మహాత్మ్యమును గుఱించి నేనేమియు వర్ణింపలేదు. గాని "కలౌ వేంకటనాయకః" అను వాక్యము సార్ధకమని తెల్పుటకు దృష్టాంతరములు పెక్కులుగలవు. అందులో నొకటిఁ బేర్కొనెదను. ఒక్కదివసమున అనగా శుక్రవారమునఁ గొచ్చిసంస్థానములోనివారు తమ కుటుంబసహితము మధ్యాహ్నము 11 ఘంటలకు తిరుమలకు వచ్చిరి. అందులో గృహిణికి కాళ్లు 6 నెలల కిందట పడిపోయి చాఁచుటకు నడచుటకు వీలులేక దేఁకుచుండెను. వారలకు స్వప్నావస్థలో "ముడుపులతో నామెను నాకొండకు తీసుకొని వచ్చి స్వల్పకాల మచ్చటనుండినఁ గాళ్లు నిచ్చెదను" అని శ్రీవారి యుత్తరవుకాఁగా వారువినక కాళ్లు బాగుపడి నంతట వచ్చెదమని ప్రార్థించిరి. ఆఱునెలలదాఁకఁ బ్రతీక్షించి కాళ్లు రాకపోవుటవలన శ్రీవారి యాజ్ఞప్రకారము వచ్చిరి. ఇచ్చట నొక్కవార ముండమని స్వప్నమయినది. ఆప్రకారమె