పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

21

తిరుపతి కేడుమైళ్ల దూరమున నారుకొండలు దాటి ఏడవ కొండయగు వేంకటాచలము మీద శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానముగలదు. ఆ దేవస్థానమునకు బయట ప్రదక్షణము నాల్గువీధులవలె నున్నది. ఆ వీధులలో సుమారువెయ్యిమంది జనాభాగల గ్రామముగలదు. దీనికి తిరుమలని వాడెదరు.

2. శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానము

ఈ దేవస్థానము అనాది అని పురాణము వల్ల నేర్పడును. శ్రీవేంకటేశ్వరస్వామివారి మూర్తియందుండు చిహ్నములు జూచి శివుడా? విష్ణువా? శక్తియా? అను సంగతి పలువురకు తోఁపకమానదు. శ్రీవైకుంఠమునుండి కలియుగములో జనులనుద్ధరింపభూలోకంబునకే తెంచిన శ్రీమహావిష్ణువని చెప్పెదరు. విఘననమతస్థులు పూజనొనర్చెదరు. దక్షణ ఇండియా గెజెటీరులో (South India Gazettee) “గుడిపూర్వచరిత్ర సరిగా తెలియక బుక్కిట పురాణములతో నిండియున్నది. మిగుల ప్రాచీనమైనదనుటని స్సందేహము కలియుగమాదిలో గట్టబడినట్టును కలియుగాది 5000 సంవత్సరము లయినతర్వాత భూమిమీద విష్ణుపూజ తగ్గుననియు పురాణములో జెప్పబడినట్టు వ్రాయఁబడినది. హిందూరాజులు కాలములోని దేవస్థానపురాబడి గుడిలోనే మతసంబంధమై పనులకు (Ceremonies) వెచ్చింపబడుచుండెను. ముసలమానులకాలములో నీరాబడి రాజుల స్వప్రయోజనమునకు వెచ్చించబడుటకు ప్రారంభమాయెను.” అనువగైరాలు చెప్పబడినవి. ఇప్పటికి కలియుగము బుట్టి 5023 సంవత్సరంబులాయెను. మహిమతగ్గుటకు బదులు హెచ్చుచున్నది.