పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

తిరుమల తిరుపతి యాత్ర.

దేవస్థానపు మహాద్వారమునకు పడికావలి అని పేరు. మహద్వారము మీద నొకగోపురముగలదు. ఇచ్చట దేవస్థానపు గుమాస్తా ఒకరును కావలిభటులు నుందురు. దేవస్థానము లోపలకును, లోపలనుండు బయటకును తీసుకొని పోబడువానిని తనిఖీచేయుదురు. పడికావలి బయటనుండి బంగారుమలాంచేయబడిన రేకుతో కప్పబడిన ధ్వజ స్తంభము మొదలగునవికనబడును. యాత్రికులాపడి కావలిగుండా గోవిందనామ సంకీర్తనము చేయుచు వెళ్లుటచూడగ నహ్లాదకరము ప్రతివానికి నుండక మానదు.

పడికావలి దాటగానె నొక ప్రదక్షణముగలదు. దానికి సంపగ ప్రదక్షణమని పేరు. ఈ ప్రదక్షణమునడిమి పడికావలి అను ద్వారముగుండా దాటగా విమానప్రదక్షణము గలదు. ఇదిగాక వైకుంఠ ప్రదక్షణముగలదు. ఇది ముక్కోటియేకాదశి అనఁగా ధనుర్మాసములో శుక్లపక్ష ఏకాదశి ఉదయమున తెరచిద్వాదశి సాయంకాలము మూయుదురు.

3. వెయ్యికాళ్ల మంటపము.

శ్రీవారి దేవస్థానము కెదురుగ నీమంటపమున్నది. మంటపములోనికి వెళ్లుటకు పశ్చిమపార్శ్వమునుండి మెట్లు కలవు. మంటపమునకు పశ్చిమభాగము అంగళ్ల వల్ల మూయబడినందున నుత్తరపార్శ్వమార్గము చాలయుపయోగింపఁబడుచున్నది. వెయ్యి స్తంభములున్నవని చెప్పుటయే కాని యిప్పుడంత సంఖ్యలేదు. యీమంటపములో కొంతభాగము శిధిలమై పడిపోయినందున కంబముల సంఖ్య తక్కువ. మంటపముకట్టిన కాలము సరిగా తెలియదు కాని నిండపురాతనమని చెప్పుటకు సందియ