పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

తిరుమల తిరుపతియాత్ర.

నతడు, వెంబడించిచేకొని మన్మధహతుఁడై మీదఁబడెను. అది మొదలు యజ్ఞోపవీతముత్యజించి ముండనంబుగావించి అబ్రాహ్మణకృత్యమైన గోవధయు, గోమాంసభక్షణయు మద్యపానము చేయ చండాలత్వముబొంది కృష్ణవేణీతీరము నకుంతలతో 12 వత్సరంబులుండె. కుంతలపరలోక ప్రాప్తిఁబొంద నతఁడు పిచ్చివానివలె తిరుగుచుండ మార్గమున నుత్తరదేశపు రాజులు పరివారంబుతో వచ్చుచుండయుచ్చిష్ఠంబు భుజించుచుఁ గూడవచ్చెను. వార్లు కపిలతీర్థములో స్నానముచేసి పార్వణవిధానంబుగ పితృశ్రాద్ధముజేయ నితడు క్షవరంబు జేయించుకొని తీర్థములో మునిఁగి మృత్పిండములు పెట్టెను అంతపితృలు ముక్తినొందిరి. మరుదినము వార్లందరితో గొండకువచ్చెను. తనకువమనములు విశేషముగల్గె దుర్గంధము హెచ్చాయెను. అచ్చటి వారలేగాక యింద్రాదిదేవతలు గూడనేమి యీదుర్గంధమనుచు వచ్చిరి. అంతనొక యగ్నిపుట్టి యాదుర్గంధమును దహించె. దేవతలందఱా విప్రుని పాపంబులు బోవఁజూచి పుష్పవర్షము గురిపించి “నీవు గతపాపుఁడవైతివి. శ్రీస్వామిపుష్కరిణి స్నానముచేసి శ్రీవరాహస్వామి వారిదర్శన ప్రాప్తిఁబొంది దేహముత్యజింపుము. నీవు పాండవ దౌహిత్రకులంబున సుధర్ముని పుత్రుఁడవైపుట్టి తొండమాన్ దేశాధిపతివై నారాయణ పురమును బాలించుచు నీకుమార్తె జగన్మాతను జగత్పతికిచ్చి పరమపదము పొందెదవ”ని ఆపారునకు చెప్పెను. తదాది సర్వపాపములను హరించునదగుటచే నీ పర్వతంబునకు వేంకటాచలమని పేరు గలిగె.