పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/145

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


100 తిరుమల తిరుపతియాత్ర.

6. శతృమిత్రభేదము లేక “ ఆత్మవత్ సర్వభూతానీ” అను {ప్రకారము నడచువారు.

7. ధర్మశాస్త్రవేత్తలు, వీర్లకు శిశ్రూష చేయువారు.

8. గోబ్రాహ్మణ శిశ్రూష చేయువారు. తీర్థయాత్రా పరులు.

9. అన్న దానము చేయువారు.

10. తోటలు, భావులు దేవాలయములు నేర్పరుచు పోరు.

పూర్వకాలమున గోదావరితీరమున వేదవేదాంగపారంగతుఁడు అగ్ని హోమాదిక్రతువులొనర్చిన పుణ్యశీలయనునొక విప్రవర్యుండుండెను. అతడు పితృతిధికి నిమన్త్రరరణకు గాను గొప్ప పండితుండును అగ్నిష్టోమము చేసినవాడును సుశీలుడును అయిన నొక బ్రాహ్మణుని పిల్చెను. నిమన్త్రణానంతరము పుణ్యశీలుడు గర్దభముఖ ప్రాప్తిబొందెను. ఇందుకు దుఃఖతుడై కారణంబుగానక స్వర్ణముఖరీ తీరమందాశ్రమములో నుండు అగస్త్య ఋషివద్దకుబోయి వేడ వారిట్లు వచించిరి."పుత్రుడు లేని బ్రాహ్మణుని నియంత్రణకు నిర్మించుటచే నిట్లు దోషముగల్లెను.

శ్లో.

యేలో కేహక్యకవ్యాదౌ వన్ధ్యాయాస్సామినంద్విజమ్।
నియోజయన్తితేయాన్తి ముఖేగార్దభరూపతామ్.॥


శ్లో.

శుభకర్మణివావి ప్రనైతృకేపికర్మణి,।
వన్ధ్యాపతిమపాపం కదాచిన్న నిమన్తృయేత్ .॥