పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

99

సమేతుడైన శ్రీమహావిష్ణువు పరిహార సహితముగి ప్రత్యక్షమాయెను.

శ్లో.

ఏతేనచకృతాళోస్మి వెజ్కకేశ జగిత్పతే।
యన్నామన్మతిమాత్రేశోమహాపాతకపోచ॥


శ్లో.

ముక్తిం ప్రయన్తిమానుజాన్తం పశ్యామి జనార్ధమ్.।
త్వత్పాదపద్మయుగ నిశ్చలాభ క్తిరన్తుమ్.॥

"మేఘమాసములో చిత్రానక్షత్రయుక్త పూర్ణిమనాడు ఈతీర్థములో స్నానమొనర్చినవారు పునరావృత్తి వర్జిషితసుఖం బునుబొందెదరు. రామానుజ ! నీవు ఈతీర్ధముు నొద్ద వసించుము. కర్మానుభవముగ నీవు జన్మాంతమున మత్స్య రూపంబు బొంచెదవు. ఈ తీర్థములో స్నానముజేసినవారు భాగవతోత్తములగుదర"ని శ్రీస్వామివారు చెప్పి భాగవత లక్షణంబువచించున్నారు.

1. సర్వహితము గనసూయ మత్సరాదులు లేని జ్ఞాన మునిస్పృహత్వము శాంతము గలిగినవారు.

2. అపరిగ్రహశీలులుగ నుండీగను మనోవాక్కాయ కర్మలచే పరపీడ చేయనివారు.

3. సత్కథ శ్రవణమందు సాత్విక బుద్ధిగలిగి నాయందు భక్తిగలవారు.

4. పరనిందజేయక సుగుణ గ్రహణము గావించువారు

5. తల్లి దండ్రుల శిశృూషచేయు వారు. దేవతార్చన యందానక్తిగలవారు.