పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

తిరుమల తిరుపతియాత్ర.

6. షరాబు.

భుజమున సంచివేసుకొని యాత్రికులుండు తావునకు వచ్చి రూపాయలకు చిల్లరయున్ను, సవరములకు రూపాయలున్ను నిచ్చెదమని కొందఱు షరాబులు వచ్చెదరు ఇంకను కొందిఱు తిరుమల బజారువీధిమధ్యగ అంగళ్లు పెట్టుకొని చిల్లర, రాగి, రూకలు, వెండి గుండ్లు కండ్లు, కాళ్లు మొదలగు నవి హుండీలో వేయుటకు యాత్రీకులకు విక్రయించెదరు. వీరితో బేరముచేయునప్పుడు యాత్రీకులు జాగరూకతతో సర్తింపవలెను. ప్రార్ధన లేనిది రాగిరూకలు మొదలగునవి కొని హుండీలో వేయనవసరము లేదు. అట్లు వేయవలెనను నిర్భం ధము దేనిస్థానములో లేదు.

7. ముడుపులు.

శ్రీవారి ముడుపులు శ్రీవారికే జేర్చవలెను. ఇందుకుడలా లీలు తరగర్లు కమీష ్ ఏజంట్లు చెప్పుసంగతులు గుఱించి జాగ్రతగ నుండవలెను. డలాలీల దుర్భోధనను వినినయెడల యాత్రికులప్రార్ధనలు సఫలము కానేరవు. అని శ్రీవిచారణకర్తలవారు నోటీసులు ప్రచురపరచినారు. యాత్రీకులు ఇతరు లనునమ్మక స్వయముగ వారే స్వామివారి కొప్పెరలో వేనేను కొనవలెను.

8. చంద్రగిరిరస్తా.

తిరుమలెకు తిరుపతిమార్గమేగాక చంద్రగిరి మార్గమున గూడరావచ్చును. అయితె తిరుపతిరస్తావలె రాజభాటగాదు. డోలీలు బండ్లు ముందు ఏర్పాటు చేసుకోనంతట దొరకవు. ఈ