పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

79

365 హారతులు, లేక, అర్చనల సామానులు రెండు మూఁడు దఫాలు దెచ్చి పూర్తిచేసెదరు. అట్లు చేయకుండ నేర్పాటు చేసుకొన వలయును.

4. శ్రీపాదచందనము.

శ్రీవారికి ప్రతినిత్యము రాత్రిమంచపు శేషకాలములో సమర్పణయి తెల్లవారి మ్విరూపదర్శన కాలములో కొంత కర్చుపడి మిగతలో స్వల్సము అర్చకులకు చేరును. తక్కినది దేవస్థానము పారాపత్యదార్ వద్దనుండును. నిచక్షణగ వారివలన భక్తులకు ఖర్చునెట్టబడును. అర్చకులవద్ద నెలకుదొరకును.

5. శ్రీపాదరేణువు.

శ్రీవారికి సమర్పణ అయిన పచ్చకర్పూరము పునుగు తైలము మిశ్రమమునకు శ్రీపాదరేణువు అనిపేరు. దేవస్థానమువారు సాధ్యమైనంతవరకు స్వల్పముగా భక్తులకుచితార్ధమిచ్చెదరు. వెలకు అర్చకులు మొదలగుకొందఱు కైంకర్య పరుల వద్దదొరకును. అభయ స్తములు అనఁగా శ్రీవారిహస్తముకు నొత్తబడి రేకలుగల్గిన చందనపు బిళ్లలు.

మాణిక్యములు, అనఁగా శ్రీవారి హస్తకవచముననున్న రత్నములకు నొత్తబడిన చందనపుబిళ్లలు. పుళికాపుతీర్థము అసఁగా శ్రీవారికి శుక్రవారమున జరిగిన అభిషేకతీర్థము. దీనిని యాత్రస్థులు తమ ప్రదేశములకు తీసుకొని నెళ్లెదరు. వారము దివసములు నిల్వయుండును. యాత్రస్థులు ప్రసాదములు కానున్నప్పుడు అవిసరిఅయిన ప్రసాదములని నిర్ధారణ చేసుకొనన లెను.