పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0176-03 మాళవి సం: 02-377 నామ సంకీర్తన

పల్లవి: దేవ నమో దేవా
పావనగుణగణభావా

చ. 1: జగదాకారచతుర్భుజ
గగననీలమేఘశ్యామ
నిగమపాదయుగ నీరజనాభ
అగణితలావణ్యాననా

చ. 2: ఘనవేదాంతైగణన వుదార
కనకశంఖచక్రకరాంకా
దినమణిశశాంకదివ్యవిలోచన
అనుపమరవిబింబాధరా

చ. 3: భావజకంజభవజనక
శ్రీవనితాహృదయేశ
శ్రీవేంకటగిరిశిఖరవిహార
పావనగుణగణభావా