పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0173-04 భూపాళం సం: 02-359 భక్తి

పల్లవి: పావనము గావో జిహ్వా బ్రదుకవో జీవుఁడా
వేవేల కితని నింక వేమారునుఁ బాడి

చ. 1: హరినామములే పాడి అతని పట్టపురాణి
ఇరవై మించినయట్టి యిందిరఁ బాడి
సరి నిరువంకలాను శంఖచక్రములఁ బాడి
వరద కటిహస్తాలు వరుసతోఁ బాడి

చ. 2: ఆదిపురుషునిఁ బాడి అట్టె భూమిసతిఁ బాడి
పాదములఁ బాడి నాభిపద్మముఁ బాడి
మోదపు బ్రహ్మాండాలు మోచే వుదరముఁ బాడి
ఆదరానఁ గంబుకంఠ మంకెతోఁ బాడి

చ. 3: శ్రీవేంకటేశుఁ బాడి శిరసు తులసిఁ బాడి
శ్రీవత్వముతోడురముఁ జెలగి పాడి
లావుల మకరకుండలాల కర్ణములు పాడి
ఆవటించి యీతని సర్వాంగములుఁ బాడి