పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



చ. 9:

జలధులు గలఁగెను జడిసె లోకములు
తలఁకె సప్తపాతాళములు
వులికిపడఁ దొడఁగె నూర్ధ్వలోకములు
కొలువున నిలిచెను ఘోరసింహము

చ. 10:

అచ్చట హిరణ్యు నదరంటఁబట్టి
యిచ్చలఁ దొడపై నిడి చించి
కుచ్చి వాని పేగులు జంద్యములుగ
విచ్చి వేసుకొనె విష్ణుసింహము

చ. 11:

పొగడిరి దివిజులు భువనములు వెలసె
పగయుడిగి చెలఁగెఁ బ్రహ్లాదుఁడు
మిగులశాంతమున మించె శ్రీవేంకట-
నగమున నహోబలనారసింహము