Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 03-6 శంకరాభరణం సం: 10-017

పల్లవి:

తగు నీకు నాకును దయ్యమె కూరిచినాఁడు
నగవుల సరసాలె నయమాయ మనకు

చ. 1:

జూటుఁజూపులనె నన్నుఁ జూచేటి వోజవరాల
సూటి నామనసు నీపైఁ జోటు గైకొనె
నాటుకొన్నతమకము నాకు నీకు నొక్కపాటె
యేటలమాయల యెర వేఁటి కింక మనకు

చ. 2:

ఆనమాఁటలనె నన్ను నద్దలించే వోయింతి
వాసి నామోహము నీతో వావి గలసె
యీసుల మరనికాఁక యిద్దరికి నొక్కసరె
వేసాలజగడముల వేఁగ నేల మనకు

చ. 3:

వలపులు చల్లి నన్నె వలవఁ దీసేటి కాంత
చెలిమి నే నీతోడఁ జేసితి నిట్టె
నలువైన శ్రీవెంకటనాథుఁడ నిన్ను గూఁడి
వులుకు లేక వుండఁగా నొనగూడె మనకు.