ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0007-05 నాట సం: 10-041
పల్లవి:
ఎన్నిచేఁత లెన్నిగుణా లెన్నిభావాలు
యిన్నేసి నీమహిమ లివి నీకె తెలుసు
చ. 1:
యేమిలీలలు నటించే వేమయ్యా దేవుఁడా
భూమిలో జీవుల నెల్లఁ బుట్టింపుచు
ప్రేమతో నాటలాడేపిన్న వాఁడఁవూఁ గావు
నీమహిమ లిన్నయూ నీకె తెలుసు
చ. 2:
యెంతని పరఁదుకొనే విందిరానాథుఁడా
అంతరంగములనుండె అందరిలోన
వింతలు లేవు నీకు వెఱ్ఱివాఁడవూఁ గావు
యింతేసి విచారాలు యివి నీకె తెలుసు
చ. 3:
చెలఁగి వరాలిచ్చేవు శ్రీవెంకటనాథుఁడా
తలఁకక నిన్నుఁ గొల్చే దాసులకు
అలరి నీవై తేను ఆశకుండవూఁ గావు
నెలవైన నీసుద్దులు నీకె తెలుసు