Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 10-6 బౌళి సం: 10-059

పల్లవి:

ఏలరా కృష్ణుఁడా

చ. 1:

పగటూ మాఁటల నొగరూ దోఁచఁగ
మగనాలిని నన్ను నగఁ జూచే వేరా

చ. 2:

కొనబూ విటుఁడ నీ కనుచూపులనె నా
మనసూ గరఁగించఁ బెనఁగే వేరా

చ. 3:

కలికీచేఁతల వలపంచి నను నిట్టె
కలసితి శ్రీవెంకటగిరినాథా