Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 10-5 తెలుఁగుఁగాంబోది సం: 10-058

పల్లవి:

చెప్పరె మీరైనా బుద్ధి చెలులాల
అప్పసము మా కదిరి యప్పనికి

చ. 1:

యింతగా వలచినవాఁ డింటికి వచ్చితే నేమి
అంతలోఁ దనకును సిగ్గాయ నటవే
పంతము దప్పిపోయీనా పచ్చిదేరేమాఁటలను
అంతేసి తన్నుఁ దూరనాడఁ జాలఁ గాక

చ. 2:

మన సిచ్చినట్టివాఁడు మాఁటలాడితే నేమి
తను నెవ్వరైనా వద్దనే రటే
చనుమొనలు సోఁకగాఁ జాణతనపుఁజేఁతల
చెనకలేనా కొంత చేకాచి కాక

చ. 3:

కదిసినవాఁడు నన్నుఁ గాఁగిలించితే నేమి
అదను గాదా తనకు నడ్డమా యేమి
వెదచల్లుఁ గరిమి శ్రీవెంకటనాథుఁ డై కూడె
పదిలమై యిఁక దన్నుఁ బాయలేనుఁ గాకా.