Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 07-5 శంకరాభరణం సం: 10-040

పల్లవి:

ఇది నీకె సమ్మతైతె యెవ్వరైనాఁ గాదనేరా
మదిలో నీ వేల కొంకు మానవో కాకా

చ. 1:

పొలఁతి యంపిన లేక బూతులు దొరలఁ బోలు
వెలయ నే మడిగినా వెళ్లనాడవు
యెలమి నాపె కానికె యెంగిలై యుండఁగఁ బోలు
సొలసి చెలులకును చూప వైతివి

చ. 2:

అతివంపిన యేకాంత మాయములుసోఁకఁబోలు
యితవై నీలోలోనె యిందుకొంటివి
సతి వంపిన పువ్వుల సవరము గాఁబోలు
తతి నేము దగ్గరిన దాఁచుకొంటివి

చ. 3:

కలికి దగ్గరితేను కాఁకలు రేఁగఁగ బోలు
చెలరేఁగి పానుపు చేరఁబోతివి
వెలయ నిన్నును శ్రీవెంకటనాథ కూడఁగా
మెలుఁత మించఁగఁ బోలు మెచ్చుకొంటివి