పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0301-1 సాళంగనాట సంపుటం: 11-001

పల్లవి: నీ విన్నిటా నేర్పరివి నే నంతేసి నేరను
         మోవి గిరిపే నింతె ముంచి యేమి సేసేరా

చ. 1: కప్పురము నోటి కిచ్చి కాఁక లెల్లా రేఁచేవు
       యెప్పటివాడవె కావా యేరా నీవు
       అప్పటి మంచివాఁడవై యానలు వెట్టుకొనేవు
       రెప్ప లెత్తి చూచే నింతె రేసు లేమి సేసేరా

చ. 2: అంచెలను విడె మిచ్చి ఆసలు వుట్టించేవు
       మంచి చుట్టుమవె కావా మాకు నెప్పుడు
       లంచము మో విచ్చె నంటా లావులనె పెనఁగేవు
       మంచానకుఁ దీనే నింతె మరి యేమి సేసేరా

చ. 3: గందవొడి మీద జల్లి కాగిలించుకొనేవు
       అందగాఁడవె కావా అన్నిటా నీవు
       పొందుల శ్రీవెంకటేశ భోగించితివి నన్ను
       మందెమేళా లాడే నింతె మరి యేమి సేసేరా