పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0317-4 దేసాక్షి సంపుటం: 11-100

పల్లవి: మాఁటలు నాతో మా కేల
         ఆఁటదాని కస రంటీఁ గాని

చ. 1: చెప్పక చెప్పిన చెలివిన్నపములు
       ఱెప్పల తుదలనె ఱెట్టించే
       వుప్పతించి ని న్నొకటి నాడము
       తప్పనిబాసలె తగిలీఁ గాని

చ. 2: అంపక యంపిన అంగన కానికె
       ముంపుకుచములనె మొన చూపే
       గుంపెనతో నిఁక కూరిమి గొసరము
       పెంపువిరహమె పెనగోనీఁ గాని

చ. 3: కూడక కూడిన కోమలికోరికె
       వాడుమోవిని వన్నాయి
       యీడనె శ్రీవెంకటేశ యేలితవి
       వేడుకవలపులె వెతకీఁ గాని