పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/606

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9116-04 దేవగాంధారి సం: 04-602 అంత్యప్రాస

పల్లవి:

కలిగినమతి వృథ గాకుండా
అలరుటె పుణ్యంబగు ఫలము

చ. 1:

ఒనరిన యీ భవము సురనకుండ
ఘనుఁడీ జీవుఁడు గలఫము
తనువు మోచి చైతన్యాత్ముని మతిఁ
గనుటె వివేకముగల ఫలము

చ. 2:

చేసిన పుణ్యము చెడిపోకుండ
శ్రీ సంపద మెరసిన ఫలము
ఈసుల రేసుల యితర దూషణలఁ
బాసుటె అపురూపపు ఫలము

చ. 3:

హరిఁ గొలిచియు మిథ్య గాకుండ
విరసముడిగి చదివిన ఫలము
తిరు వేంకటగిరి దేవుని సరిగా
పరులఁ గొలువనిదె బహు ఫలము