పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9౦22-04 ముఖారి సం; 04-543 వేంకటగానం

పల్లవి:

ఎన్నటి కెవ్వరికితఁడే
అన్నిటానున్న అధికుఁడు

చ. 1:

ఆతుమ కంతర్యామీ స్వామీ
యేతరినైనా నితఁడే
పాతక శూరుఁడు పారశరీరుడు
పూతన ప్రాణ ఘాతకుఁడు

చ. 2:

అక్కర దీరచ నందాఁ జెందా
యెక్కడనైనా నితఁడే
పుక్కిటి లోకాలు పొందుగా నించి మా
దిక్కైనా పరదేవుఁడు

చ. 3:

నేరమి నేరుపు నించాఁ బెంచా
నేరీతినైనా నితఁడే
కారుణ్యనిధి వేంకట విభుఁడు మా
చేరువై యున్న చెలువుఁడు