పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9022-01 శ్రీరాగం సం: 04-540 విష్ణు కీర్తనం

పల్లవి:

చండ ప్రచండాది జయ విజయులన్‌
అండఁ బూజించి హరి కటుగదా పూజ

చ. 1:

కూర్మ భూమ్యాదులను గోరికఁ బ్రతిష్ఠించి
ధర్మముఖ్యంబుల నధర్మాదులన్‌
కర్మగతిఁ జామర గ్రాహిణులఁ బూజించి
మర్మంబుగా హరికి మరికదా పూజ

చ. 2:

గరుడ సేనేశులను ఘనుని శేషుని మరియు
వరమతులఁ బాదసంహినులను
కరమొప్ప శంఖచక్రగదాసి శార్జఞ ముల
అరసి పూజించి హరికిన పుడుగా పూజ

చ. 3:

నవకిరీటమును గుండలహార కౌస్తుభము
లవిరళపుఁ బీతాంబరాదులలర
వివిధగతిఁ బూజించి వేంకటేశ్వరు పూజ
యివదఁ దళిగలు పెట్టుఁడిదిగదా పూజ