పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



చ. 9:

బిగిసి మేఁకమెడ పిసికెడి మాటలు
పగలుగాఁగ రేయివగలు సేసి
జగములోన నెల్ల జాటుచుఁ బెద్దల
అగడుసేయఁ బుట్టినతఁడు వో యితఁడు

చ. 10:

మెట్టనిచోట్ల మెట్టుచుఁ బరువులు
పెట్టెడిరాయ...............
కట్టెడికాలము కడపట నదయుల(?)
నట్టలాడించిన అతఁడు వోయితఁడు

చ. 11:

తలఁకకిన్నియుఁ జేసి తనుఁగాని యాతని
వలెనె నేఁడు వచ్చి వసుధలోన
వెలుఁగొంది వేంకటవిభుఁడై వెలసిన
యలవిగాని విభుఁడతఁడు వో యితఁడు