పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/539

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9016-03 బౌళి సం: 04-536 నామ సంకీర్తన

పల్లవి:

కందర్పజనక గరుడగమన
నందగోపాత్మజ నమో నమో

చ. 1:

వారిధి శయన వామన శ్రీధర
నారసింహ కృష్ణ నమో నమో
నీరజ నాభ నిగమ గోచర
నారాయణ హరి నమో నమో

చ. 2:

పరమ పురుషా భవ విమోచన
వరద వసుధావధూవర
కరుణా కాంతా కాళిందీ రమణ
నరసఖ శౌరీ నమో నమో

చ. 3:

దానవ దమన దామోదర శశి
భాను నయన బల భద్రానుజ
దీన రక్షక శ్రీ తిరు వేంకటేశ
నానా గుణమయ నమో నమో