పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0377-05 గౌళ సం: 04-451

పల్లవి:

వలసిన వారికి వై పులివి
చలమున మానుటే జయమర్మం

చ. 1:

తనలోనే పో దైవము
ఘనమే యణువై కనినది
కనవలె నీతనిఁ గనుటకు
మనసు లయమౌటే మర్మం

చ. 2:

భావములోనే పరమము
తావై తలఁపే తగిలినది
కైవశమై యిది గలుగుటకు
కేవల శాంతం కృతమర్మం

చ. 3:

హృదయములోనే యింతాను
తుదిపదమై మదిఁ దోఁచీని
యెదుటనే శ్రీవేంకటేశ్వరుని
కదిసి భుజించుటే ఘనమర్మం