పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0014-5 ఆహిరి సం: 05-084

పల్లవి:

లంజకాఁడవౌదువురా లంజకాఁడవౌదువు నీ లాగులెల్లఁ గానవచ్చె
ముంజేతఁ బెట్టిన సొమ్ములకద్దమేలరా

చ. 1:

కొంకక యెవ్వతో కాని కోరి నీబుజము మీఁద
కంకణాల చేయి వేసి కౌఁగిలించఁ బోలును
వంకలైన వొత్తులెల్ల వడిఁ గానవచ్చె నింక
బొంక నేమిటికిరా నీ బూమెలెల్లఁ గంటిమి

చ. 1:

ఒద్దిక నెవ్వతో గాని వోరి నీవురము మీఁద
నిద్దిరించఁ గంటమాల నీలములొత్తినది
తిద్దిన జాణవుగాన తిరిగి తిరిగి మాతో
బద్దనేఁటికిరా నేఁ బచ్చి సేయఁ జాలను

చ. 3:

వేడుక నెవ్వతో తిరువేంకటేశ్వర నిన్ను
కూడిన నీమేనితావి కొల్ల వట్టుకొన్నది
తోడనె నాకౌఁగిటిలో దొరకొంటి వింక నిన్ను-
నాడ నేమిటికిరా నా యలపెల్లఁ దీరెను