పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0013-4 ఆహిరి సం: 05-077

పల్లవి:

వలపు నిలుపలేని వారము నేమటుగాన
పలుమారు బట్టుకోన్నఁ బయికొనవేలరా

చ. 1:

ఒత్తి నీవాడినమాటకోరువఁ జాలక నే-
ముత్తరమిత్తము గాని ఊరకుండలేమురా
బత్తి గొట్టానఁ బెట్టఁగఁ బనిలేదు వోరి నీ-
చిత్తమింతేకాని యిఁక జెప్పనేమున్నదిరా

చ. 2:

కాఁకఁల బెరిగినట్టి కళవళమున నిన్నుఁ
దాఁకనాడుదుము గాని తడవుండలేమురా
యేఁకటఁ జెందినయట్టి యింతుల మాటకు నీవు
సోఁకోరువవలెఁ గాక చురుకనరాదురా

చ. 3:

సారెకు నీవెడసిన సైఁచలేము నీవు
చేరువనలిగి మమ్ముఁ జేకొనవేరా
ధీరుఁడవు కోనేటితిరువేంకటేశ నన్ను
గారవించి యిట్లానే కరుణించఁ గదరా