పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0007-4 శ్రీరాగం సం: 05-041

పల్లవి:

ఎన్నఁడునుఁ గోపగించవిందుముఖి నీవిట్లా
విన్నవి వదనమెల్లా వింతలాయ నిపుడు

చ. 1:

ఇంతలోని పనికిఁగా నెంత చేసినాఁడవు
కాంత నిన్నటినుండి కనుమూయదాయను
బంతికూటి సతులెల్లా బలుమారు నేఁపగా
చింతతోఁ బళ్ళెము మీఁద జెయి చాఁచదాయెను

చ. 2:

ఏమిసేయఁబోయి నీవుయేమి సేసినాఁడవు
సాముకు విచ్చేయదు జవరాలు నేఁడు
దోమతెర మంచముపై తురుము వీడఁగను
తామసించి లేవదిదె తల నొచ్చీననుచు

చ. 3:

ఎవ్వరిని దూరవచ్చు నెవ్వరున్నారిఁకను
పువ్వు సజ్జమీఁదఁ గాఁగె పొలఁతికి దేహము
రవ్వగ వేంకటగిరి రమణ నీ కౌఁగిటఁ
బవ్వళించి యింతలోనె పరవశమందెను