పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0007-3 వరాళి సం: 05-040

పల్లవి:

ఆఁగఁ జేసు నా చూపులటు వోవయ్య
మూఁగిన నా వలపుల మూలకు రానేలా

చ. 1:

ఇమ్ముల నొల్లని వారమేల నీకు నామేని-
అమ్ముల పులకలొత్తీ నటు వోవయ్య
కమ్మవిలుతునిచేతఁ గాఁగెడి నన్నొరసేవు
నెమ్మది నుండి యుండి నీకు నొవ్వనేలా

చ. 2:

ఇతవు గాని వారమేల నీకు నామేని-
ఆతితాపమంటుఁ జేసు నటు వోవయ్య
రతిరాజుచేత నారడిఁబడ్డ ననుఁ జేరి
జతనాన వుండివుండి జాలిఁబొంద నేల

చ. 3:

ఇంతటి నీ కౌగిటికి నేల నేము మాకోప-
మంతరమెఱఁగనేరదటు వోవయ్య
పంతగాఁడ వెంకటపతి నీవు ననుఁ గూడి
చింతతోడఁ బొరలుచు సిలుగంద నేలా