పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0007-1 మంగళకౌశిక సం: 05-038

పల్లవి:

తన్నుఁ బాసి నేనింత దంటనట యీ
వెన్నెలబాయిట రేయి వేగుఁటింతి చాలదా

చ. 1:

ఇంటికి రాకుమని నేనంటినట చూడవే
అంటఁగాక వున్న దాన నంటినో యేమో
కంటికి నిద్దురరాక కాఁకలనే పొద్దువోక
వొంటి నేఁ బానుపున రేయుంటి నింత చాలదా

చ. 2:

అప్పటి దగ్గరి నే రానై తినట చూడవే
కొప్పు జారి సిగ్గుతోడఁ గొంకితి నేమో
చిప్పల రెప్పల జంకించితినట చూడవే
చెప్పరాని మాట నీతో జెప్పుటింత చాలదా

చ. 3:

ఊరకే మాటాడక నే నుంటినట చూడవే
ఆరడి పరవశాన నైతినో యేమో
గోరికొనఁ దనుఁ దక్క, గొంటినట చూడవే
యేర వేంకటేశ నాతోనింత నీకుఁ జాలదా