పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0094-2 ముఖారి సం: 05-375

పల్లవి:

ఎంత సేయఁగనేరదింతి గోపించినను
కంతుని గెలిపించెను ఘనుఁడైన విభుని

చ. 1:

సతవింత తాపాన చందురుఁడేఁపఁగఁ బో
ప్రతిచందురుండాయ పడఁతిమోము
అతివఁ గోవిలకూఁతలలయించఁగాఁ బో
తతిఁ గోవిలలకూఁత తానాయఁ బలుకు

చ. 2:

మలయానిలుఁడు దన్ను మలసి యేఁచఁగఁ బో
చెలివూర్పు చిరుగాలిఁ జిత్రెంచెను
తలపోఁతచింత చిత్తము సేయఁగాఁ బో
కలికిచిత్తము పతికడకంటెనిపుడు

చ. 3:

తిరుగఁ జంద్రుఁడు తన్ను తిలకించగాఁ బో
ధరియించెఁ గుచముల తానతని
తిరువేంకటగిరిదేవునికౌఁగిటి-
సిరులఁబో యిన్నిటాఁ జెలువాయె నిపుడు