పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0085-6 భూపాళం సం: 05-325

పల్లవి:

రాయడికాఁడు గదమ్మ రంతు నేసీని
పాయపుసతులనే గోపాల గోవిందుఁడు

చ. 1:

వట్టిమాయలఁ బెట్టవలదన్న మానఁడు
బెట్టుగ రేపల్లె గోపికలనెల్ల
యెట్టు వేగింతురమ్మ యెల్లవారలును
రట్టడీయైనట్టి రాచగోవిందుఁడు

చ. 2:

లేని పగలు చాటి లేమలనిందరిని
కాని కానిమ్మనుచుఁ గరఁగించీని
మాని మాని కమ్మర మగుడ మమ్మేఁచీని
రానిలే చూచుఁగాని రాచగోవిందుఁడు

చ. 3:

పొద్దు వొద్దునకెంతే బూమెలు సేయుచును
వొద్దికై నాతోడ నొనగూడీని
అద్దో యింకా మానఁడాసలఁ బెట్టెడిని
గద్దరి శ్రీ తిరువేంకటపు గోవిందుఁడు