పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0085-4 వరాళి సం: 05-323

పల్లవి:

చూపులనే సొలసేవు చూడరాదా మమ్ముఁ
గాపురము సేయనీక కారించేవా

చ. 1:

వదినెంటాఁ బిలిచేవు వద్దు సుమ్మీ యెవ్వరోయి
వదినెలు నీకు వాడవారి మరఁది
యెదురైతే మొక్కేవు యేఁటికోయి యింతేసి
వుదుటులు మాని చక్కనుండనేరవా

చ. 3:

అత్తనంటాఁ బిలిచేవు అక్కడ నిక్కడ నీకు
అత్తలెవ్వరోయి వూరఁ బొత్తులల్లుఁడా
వత్తునంటాఁ జెప్పంపేవు వడదాఁకి కూకులును
వత్తులునై పోదుఁగాని వచ్చి చూడరాదా

చ. 3:

చీర వెలిగా నవ్వేవు చెల్లఁబో యెక్కడనైన
మారుజాతి వారికైన మానములేదా
తీరు నీకు నింతేసి తిరువేంకటేశుఁడ
కూరిమి యెరిఁగి నన్నుఁ గూడితివౌరా