పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0079-6 వరాళి సం: 05-288

పల్లవి:

వెలయు నీకల్యాణవేదిగా మతినుండి
కలికి జవ్వనపు యాగము సేసెనతఁడు

చ. 1:

మలయు నీనాభిహోమపు గుండమునను
నెలకొన్న విరహగ్ని నిండాఁ బోసి
పొలయు నీ నిట్టూరుపుల విసరుచును
వొలుకుఁ జెమటల నాహుతి వోసె నతఁడు

చ. 2:

కదిసి నీనెన్నడిమి గగనమునందు
పొదలిన యారనే పొగ నిండఁగా
మదిరాక్షి నీమంచి మానపుఁ బశువు
నదనెరిఁగి వేలిచె నతివ నీకతఁడు

చ. 3:

కాటుకకన్నుల నిన్నుఁ గడునలయించి
బూటకముల చిటిపొటి సిగ్గుల
గాఁటపుఁ గరుణ వేంకటగిరివిభుఁడు
కోటిహోమము సేసెఁ గూడి నిన్నతఁడు