పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0074-5 భూపాళం సం 05-257

పల్లవి:

కలిమి నిందరిని దగ్గరుకొరకే- వీఁడె
సులభుఁడై తిరిగీని చూడరమ్మా

చ. 1:

భంగపెట్టి గొల్లవారి పాలువెన్నలు
దొంగిలించు కొరకే తోవలనెల్లా
చెంగలించి చేతులెత్తి చెలఁగుచును- వీఁడె
దొంగి దొంగి తిరిగీని తోలరమ్మా

చ. 2:

గుట్టుదీర రేపల్లెకొమ్మలనెల్లా
రట్టుసేయుకొరకే రచ్చలనెల్ల
గట్టిగాఁ జాటెడి మొలగంటలతోడ- వీఁడె
చుట్టపుబాలునివలెఁ జూడరమ్మా

చ. 3:

చెప్పరాని తనమాయచేత నిందరినిఁ
గప్పెడికొరకే వేంకటవిభుఁడు
కప్పెడి నల్లనియలకలనుదురు-వీఁడె
గుప్పెడి ముద్దులు యెత్తుకొనరమ్మా