పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0065-6 బౌళి సం: 05-204

పల్లవి:

కావరాదా కరుణించి
వావిగాని వావి వాడీఁ దరుణి

చ. 1:

పచ్చిదేరునగ్గి బగబగ మండేటిఁ
చిచ్చరకోలల చేఁతల
వెచ్చియు వేవని వేదనఁబొరలుచు
అచ్చపుటాసల నలసీఁ దరుణి

చ. 2:

నీడలేని మాఁకు నిక్కపుటెండల
తాడులేని కట్టుఁదగులున
గోడలేని పెద్దకోరిక చిత్తారు
వాడుచు లోలోనె వ్రాసీఁ దరుణి

చ. 3:

పొందు లేని పొందు భోగపుఁ బ్రియముల
కందెడి తనలోని కరఁగుల
కందువెఱిఁగి వేంకటగిరిపతి నినుఁ
బొందిన తమకానఁ బొరలీఁ దరుణి