పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0031-5 కాంబోది సం: 05-173

పల్లవి:

ఉండఁబాసీ నడవిలో వొకతె నేను
ఎండలు నీడలు గాసీ నేమి సేతురా

చ. 1:

చిన్నినానడుము చూచి సింహము దగ్గరెనంటా
ఉన్నతపుఁ గుచముల కొరసెఁ గరి
మున్నిటి పొందులు వైరమును జేసె మృగపతి
యిన్నిటికి నగ్గమైతి నేమి సేతురా

చ. 2:

నిండు నా నడపు చూచి నెమలి దగ్గరి వచ్చె
బండు నేసి నారుసూచి పాయదు పాము
రెండుఁ జూచి పగయుఁ గూరిమి దోఁచె నింతలోనే
యిండె వట్టె నిన్నిటికి నేమి సేతురా

చ. 3:

కోరి నాపలుకు విని కోవిల దగ్గర వచ్చె
చేరీ నామోవికిదె చిలుక నేఁడు
గారవాన నిన్నియు వేంకటగిరి విభుఁడా
యేరా యిట్టె చేకొంటివేమి సేతురా