పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0024-5 ఆహిరి సం: 05-136

పల్లవి:

వట్టిటసలు గాక నాకు వలతు ననెడి మాటలెల్ల
నెట్టుకొన్న మోహమైన నిలువనెట్టు వచ్చురా

చ. 1:

కొప్పువెట్టుకొనుచునున్నకొమ్మబాహుమూలమిపుడు
చొప్పదప్ప రెప్పలెత్తి చూడనెట్టు వచ్చురా
అప్పుడుపరిసురతవేళలందుఁ ఇచ్చి దోఁచునట్టి-
చెప్పరాని పనులవంకఁ జిత్తగించినాఁడవో

చ. 2:

మొలకనవ్వు నవ్వుచున్న ముదితముద్దు మోవిమీఁది-
చిలుకవోటు చూచి సన్న నేయనెట్లు వచ్చురా
వలను మెరసి నీకునందు వన్నెలైన చేఁతలెల్లఁ
గలయఁ జేయుపనికిఁ గొంత కన్నువేసినాఁడవో

చ. 3:

తట్టుపుణుఁగు శిరసుమీఁద దైలువారనంటి నొసలఁ
బట్టువెట్టుకోరి నన్నుఁ బట్టనెట్టు వచ్చురా
వెట్టిగాదు వేంకటాద్రివిభుఁడ నీవు మదనరచన-
లట్టు నిట్టుసేయ నన్నుంగవించినాఁడవో