పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0024-3 శ్రీరాగం సం: 05-134

పల్లవి:

దైవకృత మెవ్వరికిఁ దప్పింపరాదనుచు
భావించి జనులాడుపలుకు నిజమాయ

చ. 1:

కందునకుఁ బెడఁబాసి చందురుఁడింతి ముఖ-
చందురుఁడైన నది అందును గలిగె
కందువగు చెలినొసలి కస్తూరితిలకమను -
కందు ముఖచంద్రునకుఁ గడునందమాయ

చ. 2:

జలజములు శశిచేతనులికి యీ కాంతకుచ-
జలజంబులైన నది సరుసనే కలిగె
లలితమగు ప్రాణవల్లభుని సురతాంకమున
విలువ సేయఁగరాని విదియచందురులు

చ. 3:

తీగె బహుజలములకుఁ దెమలి కామిని మేనుఁ-
దీగె యయ్యిన నదియుఁ దిరుగ మరి కలిగె
ఈ గతులఁ దిరువేంకటేశ్వరుని సమసురత-
యోగంబువలన ఘర్మోదకశ్రీలు