పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0017-4 కాంబోది సం: 05-099

పల్లవి:

తమ్ములాల అన్నలాల తల్లులాల నే
నెమ్మనపు హరిఁ బాసి నిలువనేనిఁకను

చ. 1:

కొమ్మలాల మరుకోట కొమ్మలాల వో-
యమ్మలాల తొలరె నా యక్కలాల
తమ్మిరీకుఁ గన్నుల యాతనిఁ బాసి నే-
నుమ్మల సొమ్మలచేత నుండలేనిఁకను

చ. 2:

చెలులాల కలికి తొయ్యలులాల వో-‌
యెల జవ్వనముల మోహినులాల
చెలువంపు హరిఁ దలఁచిన నాకు నే -
నులుకుఁ గన్నీ రాఁపకుండలే నిఁకను

చ. 3:

బోఁటులాల జవ్వనపు మేఁటులాల వో-
గాఁటపుఁ దురుముల చీఁకటులాల
వాఁటమైన వేంకటేశ్వరుఁ బాసి నే-
నాఁటదాననై జన్మమందలేనిఁకను