పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0216-2 వరాళి సంపుటం: 08-092

పల్లవి:

ఎన్నఁడూనెరఁగమయ్య యిటువంటి పనులు
నిన్నుఁనాపెఁ గంటిమయ్య నేరుపులపొగుల

చ. 1:

నిన్నుఁజూచి వడదేరీ నెలఁత అల్లంతనుండి
కన్నులనే వలపులు కాచుకున్నవో
పన్నిన సిగ్గులువీడఁ బయ్యద జారఁగఁదోసె
చన్నులనే జవ్వనము సాదించీనో

చ. 2:

ఘాతలనె చెనకీని కాంత నీమోము చూచి
చేతులనె తమకము చిమ్మిరేఁగీనో
కాతరాన నీగుణాలు కడుఁగడుఁ గొసరీని
దూతికెవలెనే మాట దొమ్మిసేసీనో

చ. 3:

అక్కుపైనిలిచి కూడె నలమేలుమంగ నిన్ను
చక్కఁదనమెల్ల నీకు సంచమాయనో
గక్కన శ్రీవేంకటేశ కాయముఁ గాయమునంటె
పెక్కువ సింగారాలు పెనఁబెట్టెనో