పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0215-6 శుద్దవసంతం సంపుటం: 08-090

పల్లవి:

అలమేలుమంగ యీకె ఆనుకవద్దనుండది
చెలరేఁగి కందువలు చిత్తగించవయ్యా

చ. 1:

తరుణిదేహమే నీకు తగుదివ్యరథము
గరుడధ్వజంబాపె కప్పుపయ్యద
తురగములు రతులఁ దోలెడు కోరికెలు
సరినెక్కి వలపులు జయించవయ్యా

చ. 2:

దిండు కలపిఱుఁదులు తేరు బండికండ్లు
అండనే పవ్వులుగుత్తులా పెచన్నులు
కొండవంటి శృంగారము కోపునఁగల సొబగు
నిండుకొని దిక్కులెల్లా నీవేగెలువవయ్యా

చ. 3:

వెలఁదికంఠము నీకు విజయశంఖమదిగో
నిలువెల్ల సాధనాలు నీకునాపె
యెలమి శ్రీవేంకటేశ యిద్దరునుఁ గూడితిరి
పలుజయముల నిట్టే పరగవయ్యా