పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0215-3 బౌళి సంపుటం: 08-087

పల్లవి:

నీకుదొరకితేఁగన నీవుమానేవా
మైకొని నన్నిన్నిటాను మన్నించునితఁడు

చ. 1:

సేసవెట్టిన పతిని చెప్పినట్టు సేయించుకో
దోసమా నీవేల దూరవచ్చేవే
యీసు రేఁచుక దొడ్డ హితవరివలెనే
పోసరించి నాకేల బుద్దిచెప్పవే

చ. 2:

చేతికి లోనైనవాని చెక్కు వేల మీఁటితేను
యేతులా నీకేల యెకసక్యాలు
కాతరించి నీవే దగ్గరిన చుట్టమవలె
ఆతుమై నీవేఁటికి నాయాలు తిద్దేవే

చ. 3:

కూడిన శ్రీవేంకటేశు గోరనేను గీరితేను
ఆడికల నీవేల అడ్డమాడేవే
నీడనలమేల్‌మంగను నే నాకంటె నెక్కుడా
చూడఁజూడ నీవేల జోహరనేవు