ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0212-2 సామంతం సంపుటం: 08-068
పల్లవి:
ఇంక నీచిత్తముకొద్ది యింతిభాగ్యము
వుంకువ కోరికెలలో నోలలాడీనదివో
చ. 1:
వనిత వాలుక చూపు వంచి (అట్టె)
పెనఁగుచు పులకలు పెంచి
మునుకొన్న తమకము ముంచీనదె
గునిసి నీతో నలుగఁ గొంచీనదివో
చ. 2:
పొలసి మోహముమాట పొదిగి అట్టె
సెలవుల నవ్వులెల్లాఁ జిదిగి
యెలమి జవ్వనమున నెదిగి
వులివచ్చి గోరుమోప నొదిగీనదివో
చ. 3:
మోక్కపుటూరుపులు విసరి అట్టె
గుక్కక పైపై రతులు గొసరి
చక్కని శ్రీవేంకటేశ సతి గూడి నిన్ను
మొక్కుచు మోవితేనెకు ముసరీనదివో