పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0209-1 లలిత సంపుటం: 08-049

పల్లవి:

పండిపొల్లవో యీనా పట్టరానిమనసు
యెండకు నీడకుఁ దీసి యింతకోపఁగలనా

చ. 1:

చాలుఁజాలు చెలియ చవిగాదుసొలయ
మేలువాఁడై తేఁగదా మీరఁజూచేది
నాలికాఁడు మొదలనే నవ్వులనె పొద్దువుచ్చీ
యేలినప్పుడేలీఁగాక యింతకోపఁగలనా

చ. 2:

రావెరావె ముగవా రతికక్కె తెగువ
మోవులు సోఁకితేఁగదా మొనచూపేది
రావిజిగురై నవాఁడు రచియించీ తరితీపు
యేవివరమో కందము యింతకోపఁగలనా

చ. 3:

వింటివింటి కాంతా వేళవచ్చెఁగొంత
తొంటివలెనై తేఁగదా దొమ్మిసేసేది
దంట శ్రీవేంకటేశుఁడు తానేవచ్చి నన్నుఁ గూడె
యింటిలోనే నన్ను మెచ్చీ యింతకోపఁగలనా