పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0201-4 వరాళి సంపుటం: 08-004

పల్లవి:

ఇంట గెలిచి కా నీవు యిఁక రచ్చ గెలిచేది
వెంటనే ఆనతీరాదా వినవలె నేను

చ. 1:

మాయలెంత సేసినాను మచ్చికెంత వూసినాను
ఆయెడ నావలె నిన్నునాపె నమ్మీనా
కాయపు నీ ఘాతలివి కందువ మచ్చములివి
యేయింతి సేసినవంటే యేమనేవు నీవు

చ. 2:

కల్లలెన్ని ఆడినాను కదిసెంత గూడినాను
యిల్లదె నావలెనాపె యియ్యకొనీనా
తెల్లనికన్నులతేట దిష్టమైన యాచెమట
చెల్లఁబెట్టుకొని యాపె చింతవాపఁ గలవా (దా?)

చ. 3:

నెమ్మినెంత పొగడినా నీకు నీకే పొగడినా (?)
రమ్మని నావలెనాప రతిఁ గూడీనా
యెమ్మెల శ్రీవేంకటేశ యెనసితివిటు నన్ను
సమ్మతించనాడనెట్టు సరస మాడేవు