పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0246-6 దేసాళం సంపుటం: 08-276

పల్లవి:

మావంటివారి దీవెన మరి యేకాలము గద్దు
భావించి విచ్చనవిడి బతుకఁగదయ్యా

చ. 1:

వెలలేని వలపులు వేమారు గొనఁగాను
లలియెత్తితమకము లాభఁమాయను
పలచని వద్ది(ట్టి?)శిగ్గు పదారువేలకుఁ దారె
బలిమి నిఁకఁ గోటికిఁ బడిగెత్తవయ్యా

చ. 2:

చదరపు సరసాలు చాలుమూలనడవఁగా
గుదిగొన్న నగవు లగ్గువ లాయను
అదిగో పట్టపుదేవు లారడి పంతముచేరె
పదరక సవరాజ్యపట్ట మేలవయ్యా

చ. 3:

పాయపు తరితీపుల పంటలెల్లఁ బండఁగాను
చాయల రతిభోగాలు సదరమాయ
యీయెడ శ్రీవెంకటేశ యిటు నన్నుఁ గూడితివి
లాయపుటింతుల పౌఁజులనుఁ గూర్చవయ్యా