పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0243-3 సామంతం సంపుటం: 08-255

పల్లవి:

రాఁగదె పాయము రచ్చలఁ బెట్టక
కాఁగక మీఁగడ గట్టి నటవే

చ. 1:

వలచిన రమణికి వడిఁ బతితోడుత
యెలమిని పంతము లేమిటికే
కలయికలకె మరి కాచుకుండఁగా
చెలరేఁగీ యతని చిత్తముగాకా

చ. 2:

వొగ్గి ననుపుతో నుండిన కాంతకు
యెగ్గులు దప్పులు నేమిటికే
సిగ్గుతొఁ బ్రియము చెప్పఁగఁ జెప్పఁగ
నిగ్గునఁ దా మన్నించీగాకా

చ. 3:

కదిసెను శ్రీవెంకటపతితో నీకు
యెదురు మాటలిఁక నేమిటికే
పదరక వురమున బలుసుకుండఁగా
ముదములు పైపై ముంచీఁగాకా